Monday, December 23, 2024

దేశానికి దిక్సూచిలా మిషన్ భగీరథ పథకం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ తాగునీటి పథకం దేశానికి దిక్సూచిలా మారిందని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన మంచినీటి పండుగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సమైక్య పాలకులు తాగునీటిని నిర్లక్షం చేయడంతో బిందెడు నీళ్ల కోసం మైళ్ల కొద్ది వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

కరువులో చిక్కుకున్న తెలంగాణలో వర్షం కురిస్తేనే గుక్కెడు నీళ్లు దొరికే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జీవనదులు ప్రవహిస్తున్నప్పటికీ ఆంధ్ర పాలకులు నిర్లక్షంతో తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి రాష్ట్రం అవతరించగానే పరిష్కార మార్గాల వైపు దృష్టి సారించి 1996 లో సిద్ధిపేటలో కేసీఆర్ 60 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఇంటింటి తాగునీరు పథకాన్ని విస్తరించి మిషన్ భగీరధ పేరుతో రాష్త్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారన్నారు. మిషన్ భగీరధ పథకం ద్వారా ప్రతి ఇంటికి రోజు నీరు అందిస్తున్నామన్నారు.

రాష్ట్రం గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరాలో మంచి ప్రమాణాలు పాటించినందుకే కేంద్రం నుండి అనేక అవార్డులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ కే రజాక్, పిడి కిరణ్ కుమార్, డీఎస్పీ నాగభూషణం, ఎంపిపి భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జడ్పీటీసి కందాల దామోదర్ రెడ్డి, పిఎసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, సర్పంచులు కొంపెల్లి రాంరెడ్డి, తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు చూడి లింగారెడ్డి, ఎంపిటిసి పన్నాల రమా మల్లారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మున్నా మల్లయ్య, తహశీల్దార్ జమీరొద్దిన్, ఎంపిడిఓ ఇందిర, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News