Wednesday, January 22, 2025

మిషన్ భగీరథతో నీటి కష్టం తీరింది

- Advertisement -
- Advertisement -
  • మంచినీళ్ల పండుగ ఉత్సవాల్లో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్

మునిపల్లి: పదేళ్ల సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రంలో చాలా మార్పు వచ్చిందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచినీళ్ల పండుగ సందర్భంగా ఆదివారం మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామ శివారులో సింగూరు ప్రాజెక్టు సమీపంలో గల మిషన్ భగీరథ పంప్‌హౌస్ వద్ద మంచినీళ్ల పండుగను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, జడ్‌పి చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ శరత్, అడిషనల్ వీరారెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల కాలంలో ప్రజలు నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడి బోరు, బావుల నుంచి తీసుకవచ్చేవాళ్లు అని గుర్తు చేశారు.

అలాగే పక్కనే సింగూరు ప్రాజెక్టు ఉన్నప్పటికీ నీళ్లు కూడా తాపించలేన్నారు. కానీ సిఎం కెసిఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి నీటి ఇబ్బందులను తొలగించారన్నారు. బోరు, మినరల్ వాటర్ తాగి రోగాల బారిన పడకుండా మిషన్ భగీరథ నీరు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఏమైనా పెండింగ్‌లో ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు కాని, నల్లా కనెక్షన్లు ఉంటే వాటిని త్వరితగతిన పూర్తి చేసి వందశాతం మంచి నీటిని అందించేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు.

అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల విషయంలో అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయం తో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో మొత్తం 943 గ్రామాలకు గాను రూ. 1688కోట్లు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో మిషన్ భగీరథ పథకానికి కేటాయించినట్లు తెలిపారు. సింగూరు ప్రాజెక్టులో ప్రారంభమై బుదేరాకు చేరి అక్కడ నుంచి గ్రామాల్లోని ఇంటింటికి మంచినీరు అందించనున్నట్లు తెలిపారు. జడ్‌పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టి అందిస్తుందన్నారు. అలాగే మిషన్ భగీరథ ద్వారాఅందిస్తున్న మంచినీటినే తాగాలన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, ఎస్‌ఈ రఘువీర్, ఈఈలు విజయలక్ష్మి, షేక్‌పాషా, డిఈలు ప్రసన్న కుమారి, హరీష్, డిఆర్‌ఓ నగేష్, మునిపల్లి జడ్‌పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్, ఎంపిపి శైలజ శివశంకర్, బుసారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ స్వప్న శశికుమార్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి శశికుమార్, ఆయా గ్రామాల జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News