Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ దివ్య దృష్టితో మిషన్ భగీరథ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ బ్యూరో: సిఎం కెసిఆర్ దివ్య దృష్టితో మిషన్ భగీరథ తీసుకురావడం జరిగిందని తద్వారా ప్రజల మంచినీటి కష్టాలు తీరాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన మంచినీటి దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతోనే ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీరాయని అందుకు సిఎం కెసిఆర్ అపర భగీరథుడిలా పనిచేశారని అన్నారు. నిజామాబాద్ నగరంలో తెలంగాణా ఏర్పడకముందు తాగునీటి కోసం మహిళలు పడిన కష్టాలు అంతా ఇంతా కావని, నగరంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరాచేయవలసిన దుస్థితిని ప్రజలు అనుభించారని గుర్తు చేశారు. నగరంలో బోర్లవద్ద క్యూల్లో నీటికోసం కోట్లాటలు తాను చూశానని అన్నారు.

నేడు సిఎం అపరభగీరథుడిలా మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టి ప్రజల తాగు, సాగునీటి కష్టాలు దూరం చేశారని అన్నారు. నేడు ఏ నగరం, గ్రామంలోనైనా మహిళలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ప్రతీ గ్రామానికి పైపుల ద్వారా మంచినీటిని అందించడం జరుగుతోందన్నారు. నగరంలో పది లక్షల జనాభా అయినా తాగు నీటి వనరులు అందించడానికి కార్యాచరణ చేపడుతున్నామన్నారు. ఎన్నో సవాల్లను ఎదుర్కొని యుద్ద ప్రాతిపదికన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టడంజరిగిందన్నారు. నగరంలో ఎన్నడూ లేనివిధంగా 9ఏండ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. త్వరలో నిజామాబాద్ నగరం హైదరాబాద్ తర్వాత అభివృద్ధిలో ముందుండేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.

నిజామాబాద్ నగరంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో విరాజీల్లుతోందని, హరితహారంలో ఉత్తమ అవార్డు సైతం సాధించుకోవడం మన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. రాబోయ రోజుల్లో నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని నగర అభివృద్ధ్దే తన ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్ప రాజు, ఆకుల హేమలత, మురళి, పంచరెడ్డి సూరి, కృష్ణ, శ్రీనివాస్, రాము, విక్రం, ఆర్‌డబ్లుఎస్, పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News