Wednesday, January 22, 2025

మిషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి గొప్ప వరం

- Advertisement -
- Advertisement -

అంతర్గాం: ప్రభుత్వం సరఫరా చేసే మిషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి గొప్ప వరమని, శుద్ది చేసిన నాణ్యమైన నది జలాలను ప్రభు త్వం ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం మండలంలోని మూర్మురులోగల మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వద్ద నిర్వహించిన మంచినీళ్ల పండుగను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ పాల్గొన్నారు.

మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు సరఫరా అందడంపై రూపొందించిన వీడియో, వాటర్ ప్లాంట్ నుంచి జిల్లా వ్యాప్తంగా శుద్ది చేసిన నీటి సరఫరా విధానంను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ గతంలో తాగునీటి కోసం బోరింగులు, బావుల చుట్టు తిరిగి చాలా ఇబ్బందులు పడ్డామని, నేడు సీఎం కేసీఆర్ ఆధ్యక్షతన ప్రతి ఇంటికి నల్లాల ద్వారా శుద్ది చేసిన గోదావరి, కృష్ణ జలాలు అందించాలని ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టిందన్నారు.

ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మంచినీటి పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. గతంలో ఖాళీ బిందెల ప్రదర్శనలు, నాయకుల వాహనాలకు నీటి బిందెలు అడ్డం పెట్టే వారని, జిల్లా అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా బోర్లను ఏర్పాటు చేసి సరఫరా చేసే వారన్నారు. ప్రస్తుతం అలాంటి సమస్య లేకుండా పోయిందన్నారు.

మన జిల్లాలో 2 వేలపైగా కిలోమీటర్ల పైపులైన్ వేసి, 321 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఇంటింటికి శుద్ది చేసిన తాగునీటి సరఫరా చేస్తున్నామన్నారు. అంతకుముందు జిల్లాలో ప్రజాప్రతినిధులు, పాఠశాలల విద్యార్థులు మూర్మురు వాటర్ ప్లాంట్‌ను సందర్శింపజేసి, నీటి శుద్ది చేసే ప్రక్రియ వివరించారు.

వాటర్ ప్లాంట్ ప్రాంగణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రీధర్, చంద్రమౌళి, పూర్ణచందర్, ఫణీంద్రతోపాటు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News