Tuesday, December 24, 2024

మిషన్ భగీరథ నీరు భగవంతుడిచ్చిన స్వచ్ఛమైన నీరు

- Advertisement -
- Advertisement -

చందూర్: మిషన్ భగీరథ నీరు భగవంతుడు ఇచ్చిన స్వచ్ఛమైన నీరు అని దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఆదివారం చందూరు మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ మంచినీళ్ల కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటిలో ఖనిజ లవణాలు తగు మోతాదులో ఉండడం వల్ల కిడ్నీ ఇతర అనారోగ్య సమస్యల బారినపడకుండా కాపాడుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మిషన్ భగీరథ నీళ్లు ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 100 లీటర్లు చొప్పున సరఫరా చేయడం జరుగుతోందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని మిషన్ భగీరథకు రూ.500 కోట్లు ఖర్చు చేసి 70వేల కుటుంబాలకు నీరు సరఫరా చేయడం జరుగుతోందన్నారు. దేశంలో మొదటిసారిగా ప్రతి ఇంటికి నల్లా పెట్టించిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు.

చందూరు బస్టాండ్ నుంచి జలాల్‌పూర్ గ్రామం వరకు డబుల్ రోడ్డు కోసం 14 కోట్లు మంజూరయ్యాయని స్పీకర్ వెల్లడించారు. చందూర్ కొత్త మండలానికిగాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైందన్నారు. చందూరు సర్పంచ్ కర్లం సాయిరెడ్డి 24గంటల నీళ్ల సరఫరాకు ఒక లక్ష 20వేల లీటర్ల ట్యాంక్‌ను, మహిళా సమాఖ్య భవనం మంజూరు చేయాలని కోరగా స్పీకర్ మంజూరుకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కెసిఆర్ కిట్ బాలింతలకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించారు. భజరంగ్ కమిటీ సభ్యులు శివాజీ విగ్రహం మంజూరుచేసినందుకు కృతజ్ఞతగా స్పీకర్‌ను శాలువతో సన్మానించారు.

ఈకార్యక్రమంలో పోచారం సురేందర్‌రెడ్డి, ఆర్డీఓ రాజేశ్వర్, ఎసిపి కిరణ్‌కుమార్, చందూర్ సర్పంచ్ కర్లం సాయిరెడ్డి, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ రామచంద్రయ్య, ఎఎంసి ఛైర్మన్ కవిత అంబర్‌సింగ్, ఎంపిపి లావణ్య రాంరెడ్డి, ఎంపిటిసి శ్యాంరావు, సర్పంచ్‌లు సత్యనారాయణ, రవి, గంగాధర్, దేవిసింగ్, పిట్ల రాములు, ఉప సర్పంచ్ శేఖర్ యాదవ్, ఎంపిడిఓ నీలావతి, ఎంఆర్‌ఓ వసంత, సీనియర్ నాయకులు పోశెట్టి, సొసైటీ ఛైర్మన్ ప్యారం అశోక్, మద్దూరి మాధవరెడ్డి, మూడ్ అంబర్‌సింగ్, కుమ్మరి బాబు, ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News