Wednesday, January 22, 2025

మిషన్ దివ్యాస్త్ర జయప్రదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని 5 క్షిపణి తొలి పరీక్షను భారత్ సోమవారం విజయవంతంగా నిర్వహించింది. తన ‘మిషన్ దివ్యాస్త్ర’ కింద ‘మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో ఈ ప రీక్ష నిర్వహించారు. తద్వారా అటువంటి సామర్థం ఉన్న అతికొద్ది దే శాల సరసన భారత్ చేరింది. వివిధ ప్రదేశాలలో బహుళ వార్‌హెడ్‌లను ఒకే క్షిపణితో ప్రయోగించగల సామర్థం ఎంఐఆర్‌వి సాంకేతికత వల్ల కలుగుతుందని అధికార వర్గాలు తెలియజేశాయి.

విజయవంతంగా ఈ పరీక్ష నిర్వహించినందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ‘ఎంఐఆర్‌వి సాంకేతికతతో దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని 5 క్షిపణి తొలి పరీక్ష మిషన్ దివ్యాస్త్రను విజయవంతం చేసిన మన డిఆర్‌డిఒ శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నాను’ అని మోడీ ‘ఎక్స్’ పో స్ట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పరీక్ష జయప్రదం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ, మరింతగా భౌగోళిక, వ్యూహాత్మక పాత్ర, సామర్థాల దిశగా భారత్ పయనంలో ఇది ‘ఎంతో ముఖ్యమైన మైలురాయి’ అని అభివర్ణించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News