Monday, January 20, 2025

యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో…

- Advertisement -
- Advertisement -

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్న మరో కంటెంట్, రిచ్ ఫిల్మ్ ‘మిషన్ ఇంపాజిబుల్’. ఇందులో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుండగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జె ఈ మూవీని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ నిజానికి సినిమా ప్లాట్ లైన్‌లోని విషయాన్ని తెలియజేస్తుంది. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు అరెస్టు, ఆతర్వాత బెయిల్ అనే అంశాన్ని చెబుతూ ఇన్వెస్టిగేటివ్ పాత్రికేయురాలిగా తాప్సీ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. నిజమైన సంఘటన ఆధారంగా దర్శకుడు స్వరూప్ తన అద్భుతమైన రచన, టేకింగ్‌తో కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. ఇది యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన పూర్తి ఎంటర్‌టైనర్. తాప్సీ తన నటనతో ఆకట్టుకుంది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదలకానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News