- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మిషన్ కాకతీయకు స్కోచ్ అవార్డు లభించింది. ఈ పథకం ద్వారా చెరువుల పునరుద్దరణ జరిగిన తర్వాత చెరువలన్నింటినీ ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడానికి సాగునీటి శాఖ ఈ—-ప్రభుత్వ విభాగం అధునాతన రీతిలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసినందకు గాను ఈ అవార్డు అభించింది. నీటిపారుదల శాఖ ఇఎన్‌సి అనిల్ కుమార్ మార్గదర్శనం మేరకు ఈఈ రామాచారి నేతృత్వంలో ఈప్రభుత్వ విభాగం ఇంజనీర్లు ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి పరిచారు. ఆన్‌లైన్ ద్వారా ఈఈ రామాచారి ఈ అవార్డును అందుకున్నట్టు ముఖ్యమత్రి కార్యాలయ ఒఎస్డీ శ్రీధరరావు దేశ్‌పాండే తెలిపారు. ఇది మిషన్ కాకతీయ పథకానికి లభించిన రెండవ అవార్డు అని తెలిపారు. 2018లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ విభాగం నీటిపారుదలలో ఉత్తమ సాధన కేటగిరి కింద మిషన్ కాకతీయకు ఈ అవార్డు లభించింది.
- Advertisement -