హైదరాబాద్: మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సోషల్ మీడియాలో మిషన్ కాకతీయ గురించి హరీష్ రావు వీడియో పోస్టు చేశారు. అమృత్ సరోవర్‌గా మిషన్ కాకతీయ దేశ వ్యాప్తంగా అమలవుతోందని, తెలంగాణ ఆచరిస్తుందని, దేశం అనుసరిస్తుందన్నారు. గతంలో చెరువులు ఎండిపోయి కనిపించేవని… నేడు నిండు కుండల్లా చెరువులు హరీష్ రావు ప్రశంసించారు. గతంలో చెరువుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కాకతీయులు గొలుసు కట్టు ద్వారా చెరువులు నిర్మించారని, ఇప్పుడు సిఎం కెసిఆర్ గొలుసు కట్టు పద్దతిలో చెరువులో నిర్మించి నీళ్లు ఉండేలా చేశారని కొనియాడారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఊరూరా చెరువుల పండుగ నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల వద్ద సంబురాలు చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో డప్పులు, బోనాలు, బతుకుమ్మలతో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
నాడు ఎండి పోయిన చెరువులు..
నేడు నిండు కుండల్లా చెరువులు..నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం..
నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునర్జీవంఅందుకే మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం అయ్యింది. అమృత్ సరోవర్ గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది.… pic.twitter.com/zZqi6TyZqE
— Harish Rao Thanneeru (@BRSHarish) June 8, 2023