Friday, December 20, 2024

సమాజ శ్రేయస్సే శ్రేయోబిలాషి సేవ ట్రస్టు ధ్యేయం

- Advertisement -
- Advertisement -
  • మంత్రి హరీష్‌రావు
    సిద్దిపేట అర్బన్ : సమాజ శ్రేయస్సు ధ్యేయంగా పని చేస్తున్న శ్రేయోబిలాషి సేవ ట్రస్టు వ్యవస్థ్ధాపక అధ్యక్షుడు విష్ణు జగతి సే వలు అభినందనీయమని మంత్రి హరీశ్‌రావు అ న్నారు. గురువారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని హరీశ్‌రావుకు శ్రేయోబిలాషి సేలా ట్రస్ట్ ఆధ్వర్వంలో వ్యవస్థ్ధాపక అధ్యక్షుడు విష్ణు జగతి సిద్దిపేట నియోజక వర్గంలోని 138 ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రికి శ్రేయోబిషలాషి సేవా ట్రస్టు లెపెల్ పిన్ పెట్టి శాలువాతో సత్కరించారు.

సలహాదారులు దామోదరచారి తెలుగు నుంచి ఇంగ్లీష్ అనువాదం చేసిన వివిద పుస్తకాలను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రేయోబిలాషి సేవా ట్రస్ట్ వ్యవస్థ్ధాపక అధ్యక్షుడు కుటుంబ స భ్యులు, సమాజ శ్రేయస్సుకోసం చేస్తున్న ఎన్నో సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందారన్నా రు. అదే విధంగా నియోజక వర్గ పరిధిలోని 80 మంది లబ్ధిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని 22వ వార్డులో సిసి రోడ్డును, కుల సంఘాల భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రేయోభిలాషి సేవా ట్రస్టు గౌరవాధ్యక్షుడు కొలనుపాక వెంకటే శం, ప్రదాన కార్యదర్శి పోరెడ్డి మల్లేశం, రాష్ట్ర మీ డియా కన్వీనర్ బచ్చు చంద్రశేఖర్, సభ్యులు గో పాల్, రంగా సత్యనారాయణ, పురుషోత్తం, చంద్రమౌళి,సత్యనారాయణ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News