Saturday, April 26, 2025

అమెరికాలో కాల్పుల కలకలం… ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. మిసిసిపీ ప్రాంతం ఇండియానాలో చర్చి స్ట్రీట్‌లో ఓ నైట్ క్లబ్‌పై దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇండియానాలో భారత సంతతి వ్యక్తిపై డ్రైవర్ కాల్పులు జరిపాడు. కారు ఢీకొన్న విషయం ఇద్దరు మధ్య గొడవ జరగడంతో డ్రైవర్ తుపాకీ తీసుకొని భారత సంతతి వ్యక్తి మెడపై కాల్పులు జరిపాడు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News