Tuesday, November 5, 2024

దక్షిణ అమెరికాలో టోర్నోడోల తాకిడికి కనీసం 23 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అలబామా: దక్షిణ అమెరికాలోని కొన్ని భాగాలపై రాత్రిపూట టోర్నడోలు విరుచుకుపడ్డంతో కనీసం 23 మంది మరణించారని అత్యవసర అధికారులు తెలిపారు. మిస్సిస్సిపి, అలబామాలో అనేక పట్టణాలను టోర్నోడోలు తాకాయి. శనివారం ఉదయం అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సిల్వర్ సిటీ, రోలింగ్ ఫోర్క్, మిస్సిస్సిపికి చెందిన గ్రామీణ పట్టణాలు విధ్వంసానికి గురయ్యాయి. మైలు వెడల్పు ఉన్న సుడిగాలి(టోర్నోడో) ఈశాన్య దిశగా గంటకు 70 మైళ్ల వేగంతో శుక్రవారం రాత్రి వినోనా, అమోరీ పట్టణాల గుండా అలబామా వైపు దూసుకుపోయింది. భారీ తుఫాను, గోల్ఫ్ బంతి అంత వడగళ్లను కూడా తెచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News