Monday, December 23, 2024

పాఠ్యపుస్తకాల్లో తప్పులు.. ఇద్దరు అధికారులపై వేటు

- Advertisement -
- Advertisement -

మన తె లుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో దొర్లిన తప్పులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ రాధారెడ్డిపై బదిలీ వేటు వేశా రు. పాఠ్య పుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యా యి. ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌గా పా ఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేష్‌కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గురుకుల విద్య సం స్థ ల కార్యదర్శి సిహెచ్ రమణకుమార్‌కు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల వి భాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కే టాయించారు.

కొత్తగా పుస్తకాలు ముద్రించం
రాష్ట్రంలో మళ్లీ కొత్తగా టెక్ట్‌బుక్స్ ప్రింటింగ్ ఏమీ లేదని సిఎంఒ వ ర్గాలు వెల్లడించాయి. ముందుమా ట తొలగించి యథావిధిగా ఉన్న సిలబస్ ప్రకారమే బుక్స్ విద్యార్దులకు ఇస్తామని తెలిపాయి. ఇందు లో ప్రభుత్వానికి భారం పడేది ఏమీ లేదని, ప్రజాధనం రూపా యి కూడా వృథా కాదు అని పే ర్కొన్నారు. కేవలం అధికారుల ని ర్లక్ష్యం వల్ల ‘ముందుమాట’ ప్రిం టింగ్‌లో పొరపాటు జరిగిందని, ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్య వహరించిన అధికారులపై ప్రభు త్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని- సిఎంఓ వర్గాలు తెలిపాయి.

అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. బుధవారం పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్న సమయంలో ముందుమాటలోని తప్పులను ఉపాధ్యాయులు చాలాచోట్ల గుర్తించి విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు. తొలుత ఆ పేజీని చించేయాలని ఆదేశించిన అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ పేజీని తొలిగిస్తే దాని వెనుకున్న వందేమాతరం, జాతీయ గీతం, ప్రతిజ్ఞ లేకుండా పోతాయి. అప్పుడు మరిన్ని విమర్శలు వస్తాయని భావించారు. దాంతో పిల్లలకు ఇచ్చిన, ఇవ్వని పుస్తకాలన్నీ వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డిఇఒలను ఆదేశించింది. వాటిని మండల్ రిసోర్స్ సెంటర్లకు తరలించాలని సూచించారు. ఆ పేజీ మొత్తం కనిపించకుండా స్టిక్కర్ వేసి అందజేయనున్నారు. తెలుగు వర్క్ బుక్స్‌ను వెనక్కి తీసుకుంటామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News