- Advertisement -
లక్నో: ఐపిఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో ఆటగాడు మిచెల్ మార్ష్ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన లక్నో జట్టుకు మార్ష్ శుభారంభాన్ని అందించాడు. బౌలర్ ఎవరైనా కానీ.. బంతిని బౌండరీ దాటిస్తూ.. బౌలర్లకు చుక్కలు చూపించాడు. గత మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అశ్వనీ కుమార్ బౌలింగ్‌లోనూ మార్ష్ చితక్కోట్టాడు. దీంతో 27 బంతుల్లోనే అర్థశతకాన్ని సాధించాడు. అయితే విఘ్నేశ్ పుత్తూర్ వేసిన 7వ ఓవర్ చివరి బంతికి మార్ష్(60), విఘ్నేశ్‌కే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఫలితంగా లక్నో 8 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి.. 88 పరుగులు చేసింది. క్రీజ్‌లో మార్క్‌రం (15) పూరన్(11) ఉన్నారు.
- Advertisement -