Saturday, December 21, 2024

రిటైర్మెంట్‌పై మిథాలీ యూటర్న్?

- Advertisement -
- Advertisement -

Mithali Raj announces retirement from international cricket

న్యూఢిల్లీ : టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. వచ్చే ఏడాది మహిళల ఐపిఎల్ జరుగుతు న్న నేపథ్యంలో మిథాలీ రాజ్ పునరాలోచనలో పడినట్టు తెలిసింది. తాజాగా ఒక క్రికెట్ పోడ్ కాస్ట్‌లో పాల్గొన్న మిథాలీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నట్టు సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఏడాది మహిళల ఐపిఎల్ జరిగితే తాను ఆ లీగ్‌లో తప్పక ఆడతానని స్పష్టం చేసింది. ఈ లీగ్‌లో ఆడేందుకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు తాను వెనకాడబోనని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News