దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ బ్యాటింగ్ విభాగంలో ఐదో ర్యాంక్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో మిథాలీ తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకుంది. ఐసిసి మంగళవారం ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మిథాలీ 725 పాయింట్లతో ఐదో ర్యాంక్‌ను సాధించింది. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ టామి బియోమంట్ 731 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. సౌతాఫ్రికా స్టార్ లిజెల్లి లీ రెండో, అలిసా హీలీ (ఆస్ట్రేలియా) మూడో, స్టెఫాని టెలర్ (విండీస్) నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. భారత ఓపెనర్ స్మృతి మంధాన ఒక ర్యాంక్ దిగజారి 9వ స్థానంలో నిలిచింది. ఇక బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా బౌలర్ జెస్ జొనాసెన్ 808 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంది. ఆస్ట్రేలియాకే చెందిన మెగాన్ షుట్ రెండో, సౌతాఫ్రికా బౌలర్లు మరిజానె కాప్, షబ్నమ్ ఇస్మాయిల్ వరుసగా మూడు, నాలుగు ర్యాంకులను దక్కించుకున్నారు. ఇక భారత సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి ఐదోర్యాంక్‌ను నిలబెట్టుకుంది. పూనమ్ యాదవ్ 9వ ర్యాంక్‌లో నిలిచింది.
Mithali Raj world no 5 in ICC Women’s ODI Rankings