- Advertisement -
హైదరాబాద్: భారత మహిళ క్రికెటర్ మిథాలీరాజ్ బుధవారం క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. 1999లో భారత్‌కు అరంగేట్రం చేసిన మిథాలీ తన 23 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరఫున 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20లు ఆడింది. మిథాలీ రెండు దశాబ్దాలపాటు భారత క్రికెట్ కు సేవలందించారు. 232 వన్డల్లో 7,805 పరుగులు చేశారు. అందులో 7 శతకాలు, 64 అర్ధశతకాలు ఉన్నాయి. టీ-20 మ్యాచుల్లో 14 అర్థశతకాలు నమోదు చేశారు. 89 టీ-20 మ్యాచుల్లో 2,364 పరుగులు చేశారు. ఇన్నాళ్లు తనకు మద్దతిచ్చిన అందరికీ మిథాలీరాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఇన్నేళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని మిథాలీ తెలిపారు. మహిళల క్రికెట్ తీర్చిదిద్దడంలో కృషి చేశానని చెప్పారు.
- Advertisement -