Sunday, December 22, 2024

ఆస్పత్రిలో చేరిన అగ్ర నటుడు!

- Advertisement -
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిజేపి నేత మిథున్ చక్రవర్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఛాతీలో నొప్పిగా ఉండటంతో మిథున్ ను కుటుంబ సభ్యులు శనివారం ఉదయం కోల్ కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఉదయమే తనకు గుండెలో నొప్పిగా ఉందని మిథున్ చెప్పారని, దాంతో వెంటనే ఆస్పత్రికి తరలించారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. మిథున్ కి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కాబూలీవాలా అనే బెంగాలీ మూవీలో నటించారు. ఈ మూవీ గత డిసెంబర్లో విడుదలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News