Wednesday, January 22, 2025

మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

- Advertisement -
- Advertisement -

ముంబై: నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు ప్రకటించారు. ఆయన తన ఎక్స్ పోస్ట్ లో… అక్టోబర్ 8న 70వ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవంలో మిథున్  చక్రవర్తికి ఆ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

మిథున్ చక్రవర్తి సినీ పయనం అనేక మందికి ప్రేరణ కాగలదన్నారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు సెలక్షన్ జ్యూరీ ఎంపిక చేసిందని చెప్పడానికి గర్విస్తున్నానన్నారు.

నటుడు మిథున్ చక్రవర్తి, దర్శకుడు మృణాల్ సేన్ నిర్మించిన ‘మృగయా’(1976) సినిమాతో బాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో అతడు తన పాత్రను అద్బుతంగా నిర్వహించినందుకు జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు. 1982లో వచ్చిన ‘డిస్కో డ్యాన్సర్’ సినిమాతో మిథున్ చక్రవర్తి అందరికీ బాగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ అయింది.  ఆ తర్వాత 1990లో వచ్చిన ‘అగ్నిపథ్’  సినిమా కూడా బాగా ప్రేక్షకాదరణ పొందింది. అతడు ‘కసమ్ పైదా కర్నే వాలేకి’, ‘కమాండో’ వంటి సినిమాలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.

Mithun

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News