Friday, December 20, 2024

ఉద్యోగ, వ్యాపారాల్లో మిథున రాశివారిదే పైచేయి!

- Advertisement -
- Advertisement -

ఆదాయం : 05 వ్యయం : 05
రాజ : 03 అవమానం : 06

మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదముల యందు పుట్టినవారు “కా, కి, కూ, ఖం, జ్ఞ, చ్ఛా, కే, కో, హా” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మిథునరాశికి చెందినవారు.

మిథునరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రతిష్టాత్మకమైన అవార్డులు, రివార్డు లు లభిస్తాయి. ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్త లు అవసరం. విదేశీయాన శుభ ఫలితాలు యో గిస్తున్నాయి. ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం పొందడం అవసరం. స్థా నచలనం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వైరివర్గాన్ని అధిగమించి పబ్లిక్‌లో మంచి ఖ్యాతి ని పొందుతారు. భార్యాభర్తల మధ్య అధికారం కొరకు విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సోదరీ, సెదర భావనతో చేసే వారి సహాయ స హకారాలను స్వీకరించడం కొంత వరకు మీకు మంచిది. దీనివలన ఆర్థికంగా లాభపడతారు.

ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. అధికారుల మన్ననలు పొందుతారు. ధైర్యం చే సి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారాన్ని హు విధాలుగా విస్తరింప చేస్తారు. పోటీ లేకుండా మీకు మీరే అనే విధంగా మీ ఆలోచన సరళి ఉంటుంది. అనుకున్న స్థాయిలో ధనం పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను సాధిస్తారు. వైద్య విద్యలను అభ్యసించాలనే వారికి అనుకూలమైన కాలం. ఫార్మా, పాల ఉత్పత్తులు పరిస్థితులకు తగిన అమ్మకాలు చేసే వారికి, పరిశోధన రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగాలవారికి అనుకూలంగానే ఉంటుంది. కందులు, ధాన్యం, చిరుధాన్యాల పంట వేసే రైతులకు మంచి అభివృద్ధి ఉంటుంది. అపరాల పంటలు వేసే వారికి కూడా కొంత అభివృద్ధి కాన వస్తుంది. వర్షాభావం అనుకున్నంత అనుకున్న సమయానికి పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పంట నష్టాలు అయితే ఊహించినంతగా ఉండవు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శుభకార్యాల విషయంలో ఆర్థిక పరంగా కొంత భయపడతారు. మీ మనో ధైర్యమే మిమ్మల్ని అనుకూలమైన దిశకు, సరియైన వాతావరణం మలుచుకోవడంలో విజయం సాధిస్తారు. అనుకున్న సమయానికి అ నుకున్న విధంగా శుభకార్యాలను పూర్తి చేస్తారు. కాని ఎదుట వాళ్ళు సహకరించక పోగా శల్య సారాధ్యం వహిస్తారు.

వృత్తి పరంగా మీ ఆలోచనలతో చేసే కార్యక్రమాలు అభివృద్ధిని కలిగిస్తాయి. జీవితంలో నేరవేరవు అనుకున్న ముఖ్య కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం అన్ని వేళలా మంచిది కాదని గ్రహించండి. కార్యాలయంలో సహద్యోగులతో అంటీ అంటనట్టు ఉండడమే కొంత మీకు మేలు చేసే విషయం. విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఆశపడి ఎదురు చూస్తున్న నూతన గృహాన్ని కొనుగోలు చేసే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నారు. జీవిత భాగస్వామితో చర్చలు, సలహాలు మీకు కొంత ఊరటని కలిగిస్తాయి. సంఘంలో గౌరవ మార్యాదలు ఏర్పడి గుర్తింపబడతారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. కీలక విషయాలలో పెద్దల సలహాలు తీసుకోవడం అవసరం అవుతాయి. సివిల్ కేసులకు సంబంధించి ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ఐకమత్య సిద్ధాంతం వల్ల మీరు ఒంటరివాళ్ళవుతారు. ఎవరున్నా లేకున్నా మీకు దైవం అండదండలు ఉన్నాయని, తప్పకుండా ఉంటాయని తెలుసుకుంటారు. పబ్లిక్ సర్వీసులలో ఉన్న వారికి, అలంకరణా సామాగ్రి, బ్యూటీపార్లర్ నడిపే వా రికి, సినీ పరిశ్రమ, విలేఖరులకు మి శ్రమ ఫలితా లు గోచరిస్తున్నాయి.

ప్రభుత్వ (గవర్నమెంట్) పరంగా కాంట్రాక్టులు లాభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైనవాతావరణం ఉంటుంది. మొదట్లో కొంత ఇబ్బందికరం గా ఉన్నా పోనుపోనూ మీకు సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. పోలీస్, మిలటరీ, నావికా, వైమానిక దళాలలో ఉ న్నవారికి ప్రమోషన్‌లు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. దేశం కో సం మీరు చేసే సేవకు గాను సంఘంలో గుర్తింపుతోపాటు పురస్కారాలు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం మొత్తం మీద ఆర్థిక పరంగా బాగుంది. శుభకార్యాలు కుటుంబంలో చేస్తారు. కుటుంబ భాగస్వా మి సూచన మీద అనుకున్న పనులను సకాలంలో సాధిస్తారు. విలువైన వస్తుప్రాప్తి ఉం డును. కోర్టు కేసుల విషయాలలో అనుకూలత, పనులు సకాలంలో చేస్తారు.

రావాల్సిన బాకీలు చేతికి అందుతాయి. సంతాన సౌఖ్యం కలుగును. శని, రాహు గ్రహ అనుగ్రహం చేత ఎగుమతి, దిగుమతి వ్యవహారాలు లాభిస్తాయి. మీక న్నా చిన్నవారితో, కార్యాలయ సిబ్బంది (ఆఫీస్ సబర్డినేటర్)తో మీ వాక్క్ చేత (మాటలు చేత) తగాదాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. విద్యార్దులకు అంతంత మాత్రంగానే ఫలితాలు ఉంటా యి. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం. చర్మ, కాలేయ, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఉదరానికి సంబంధించిన గ్యాస్ట్రోలజీ, కంటి సంబంధ ఇబ్బందులు తరుచూ ఇబ్బందులకు గురి అవుతారు. నూతన వైద్య విధానాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. గతంలో ఆగిన ప్ర మోషన్లు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

శుభకార్యాల విషయంలో ఆర్థిక పరంగా కొంత భయపడతారు. సంతానానికి ఎలాంటి భవిష్యత్తు, వారి ఉన్నతికి ఏ విధంగా తోడ్పాటుని ఇవ్వాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు రుద్ర పాశుపత ెమం చేయించి, ఎనిమిది(8) సోమవారాలు శివునికి అభిషేకాధులు చేయడం వలన మంచి ఫలితాల ను అందుకుంటారు. నిత్యం సుబ్రహ్మణ్య అష్టకం, మన్యు సూక్తం, హనుమాన్ చాలీసా పఠిస్తే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఆకస్మిక అదృష్టం కలిసివస్తుంది. అందులో ఎలాంటి సందేహాం లేదు. కట్టడాల నిర్మాణ సం బంధమైన పనులు అనుకూలిస్తాయి. అందులో పురోగతి బాగుంటుంది. స్త్రీలతో విరోధం, స్త్రీల సహాయ నిరాకరణ, వాళ్ళతో అభిప్రాయభేదాలు ఏర్పడి కొన్ని మంచి కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News