Monday, December 23, 2024

మిథున రాశి వారి జ్యోతిష్య ఫలితాలు ఇలా…

- Advertisement -
- Advertisement -

మిథునం….
–వీరికి ఆదాయం –2, వ్యయం–11, రాజపూజ్యం–2 అవమానం–4.

వీరికి గ్రహాలన్నీ సంవత్సరమంతా అనుకూలమే. వీరు ఏ కార్యక్రమం చేపట్టినా వెనుదిరగకుండా విజయాలు సాధిస్తారు. ఆదాయం గతంకంటే మరింతగా మెరుగుపడుతుంది. రావలసిన బాకీలు చాలా వరకూ వసూలవుతాయి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మీపట్ల అసహనంగా ఉన్న వారు కూడా స్నేహహస్తం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలలో పెండింగ్లో ఉన్న ఒప్పందాలు ఖరారు చేసుకుంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహయత్నాలు ఫలించి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

తండ్రి తరఫు నుండి ధన, ఆస్తి లాభ సూచనలు ఉండవచ్చు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కే అవకాశం. ఒక వ్యక్తి ద్వారా మీకు లబ్ధి జరుగుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు ఢోకాలేదు. లాభాలు విశేషంగా అందుతాయి. ఉద్యోగాలలో మీపై∙ అభియోగాలు తొలగుతాయి. ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, సాంకేతికవర్గాల వారు విజయాలు సాధిస్తారు. పడిన శ్రమ వృథా కాదు. వైద్యులు, న్యాయవాదులు, పరిశోధకులకు శుభదాయకమే. కళాకారుల సుదీర్ఘ ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి. వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభదాయకమే. రాజకీయవర్గాలకు ద్వితీయార్ధంలో కొన్ని పదవులు వరించవచ్చు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. కొద్దిపాటి రుగ్మతలు ఇబ్బంది కలిగించవచ్చు. అయితే వెనువెంటనే ఉపశమనం లభిస్తుంది.

చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్య మాసాలు విశేషంగా కలసివస్తాయి. మిగతావి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
వీరు ప్రతి శనివారం సుందరకాండ పారాయణ చేయడం మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News