Monday, December 23, 2024

సహజీవనం… ప్రియురాలిని ప్రియుడు ముక్కలు ముక్కలుగా నరికి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని మిత్రరోడ్డులో శ్రద్ధవాకర్ తరహాలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. అక్షదీప్ అపార్ట్‌మెంట్‌లోని 704 ప్లాట్‌లో సరస్వతి వైద్య అనే మహిళతో(32), మనోజ్ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. గత మూడు సంవత్సరాల నుంచి మహిళ ఆ ఆపార్ట్‌మెంట్‌లో అద్దెకు తీసుకుని ఉంటుంది. సరస్వతిని మనోజ్ హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ప్రియుడు ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహంలోని భాగాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మనోజ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో 2022 నవంబర్ శ్రద్ధవాకర్‌ను ప్రియుడు ముక్కలు ముక్కలుగా నరికిన విషయం తెలిసిందే.

Also Read: ప్రేమపెళ్లి… ఏమైందో ఏమోకాని వరుడు ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News