- Advertisement -
హైదరాబాద్: గంజాయి చాక్లెట్లు నగర శివారు నార్సింగిలో మంగళవారం కలకలం సృష్టించాయి. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి నుంచి 40 చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సౌమ్యా రాజన్ నార్సింగిలో కూలీ పనులకు వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడు. నిందితుడు భవన నిర్మాణ కార్మికుడు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడనే సమాచారం రావడంతో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాడు.
- Advertisement -