Saturday, November 23, 2024

మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Mixed martial arts competitions begin

 

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ రాష్ట్ర స్థాయి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్ చాంపియన్‌షిప్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో జరుగుతున్న పోటీల ఆరంభోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. దేశంలోనే తెలంగాణను క్రీడల్లో అగ్రగామి నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీని కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించామన్నారు. ఇక యువత కూడా క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేసి దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేయాలన్నారు. రెజ్లింగ్, బాడి బిల్డింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు తెలంగాణ పుట్టినిల్లుగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల చారి, రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, కోశాధికారి మహేశ్, మిస్టర్ ఇండియా మెడలిస్ట్ మోతేశామ్, రాష్ట్ర మిక్సిడ్ మార్షల్ ఆర్ట్ అధ్యక్షుడు అంజద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News