Thursday, January 23, 2025

త్వరలో 50 డిగ్రీలకు..

- Advertisement -
- Advertisement -

మన వాతావరణం అత్యంత వేగంగా వేడెక్కుతోంది. రాష్ట్రంలో గత రెండు రోజులుగా అసాధారణ ఉష్ణొగ్రతలు న మోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని కోల్‌బెల్ట్‌లో ఈ పరిస్థితి మరింత అధికంగా ఉంది. పగలు ఉదయం పది గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. భూమి త్వరగా వేడెక్కుతోంది. బొగ్గు గనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో భూ ఉపరితలం ఎండల తీవ్రత ధా టికి కుతకుతలాడుతోంది. భద్రాద్రి కొత్తగూ డెం, ఖమ్మం, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండం, తదితర ప్రాం తాల్లో సాధారణ ఉష్ణోగ్రతలకంటే రెండు మూ డు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మే నెల రెండో వారం నాటికి చేరుకోవాల్సిన ఉష్ణొగ్రతలు రెండు వారాల ముందుగానే నమోదవుతున్నాయి. ఉత్తర తె లంగాణలోని
పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇ టువంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పర్యావరణ నిపుణులు డా.సజ్జల జీవానందరెడ్డి హెచ్చరించారు.

పర్యావరణంలో ఉష్ణోగ్రతలు కాలానికి అనుగుణంగా క్రమేపి పెరిగితే తట్టుకోగల శక్తి ఉంటుందని , ఆలా కాకుండా అసాధారణ ఉష్నోగ్రతలు నమోదయితే పర్యావరణంలో ఉన్న అనేక జీవరాసులపై ఆ ప్రభావం పడుతుందని తెలిపారు. భూమి త్వరగా వేడెక్కితే నేలలో అంతర్గతంగావుంటూ పర్యావరణానికి మేలు చేసే అనేక జీవరాశులు నశించిపోయే ప్రమాదం ఉంటుందని ఆందోళన వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ముందు చూపుతో చేపట్టిన హరిత హారం వల్ల తెలంగాణలో పచ్చదనం పెరిగింది. పెద్ద ఎత్తున మొక్కల పెంపకం వల్ల పెరుగుతున్న ఉష్ణొగ్రతలనుంచి కొంత తట్టుకునే శక్తి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కొన్నేళ్లనుంచి అమలు చేస్తూ రాష్ట్రంలో పచ్చదనం పెంపుదల కోసం కృషి చేస్తొంది. ఇటువంటి కార్యక్రమాలు లేకుంటే ఉష్ణగ్రతల ప్రభావం రాష్ట్రంపైన మరింత అధికంగా ఉండేదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
50డిగ్రీల ఉష్ణొగ్రతలకు సిద్దం కండి:ఐఎండి హెచ్చరిక
వేసవిలో ఎండలు ముదురుతున్న కొలది ఉష్ణోగ్రతలు పెరగటం సహజసిద్దమైన పరిణామమే అయినా ,ఇప్పటికే 40నుంచి 45గిడ్రీలకు చేరటం సాధారణంగా మారింది. ఆసియా దేశాల్లో ఉష్ణొగ్రతలు ఆసాధారణంగా పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 50గిడ్రీలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వేసవిలో 40నుంచి 50గిడ్రీల ఉష్ణొగ్రతలు నమదయ్యే అవకాశాలు ఉన్నందున అటువంటి వాతావరణ పరిస్థితులకు తట్టుకునేందుకు సిద్దం కావాలని సూచిస్తోంది. ఇప్పటికే మలేషియా, ఇండేనేషియా, సింగపూర్ తదితర దేశాలు హీట్ వేవ్స్‌ను ఎదుర్కొంటున్నాయి. అసాధారణ ఉష్ణొగ్రతలను ఎదుర్కొనేందుకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం
తెలంగాణలో గత నాలుగు రోజులుగా మిశ్రమ వాతావరణం కొనసాగుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఒక వైపు ఉరుములు మెరుపులు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు , వడగండ్ల వానలు కురుస్తుండగా, మరో వైపు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల మూడు రోజులకు సంబంధించి ప్రత్యేక వెదర్ బులిటెన్ విడుదల చేశారు. దిగువ స్థాయిలో గాలులు దక్షిణ ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. వీటి ప్రభాంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు, పలు చోట్ల ఉరుమలు , మెరుపులు,గంటకు 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరో వైపు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41డిగ్రీలనుంచి 44డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఈ నెల 21నుంచి నాలుగైదు రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి అనేకచోట్ల 40డిగ్రీలకంటే తక్కువకు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. గ్రేటర్ హైదారాబాద్ పరధిలో 21నుండి కొంత మార్పు ఉంటుందని ఉష్ణోగ్రతలు 35నుండి 37డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలింది. బుధవారం అదిలాబాద్‌లో 42.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో 41.4 హన్మకొండలో 41, హైదరాబాద్‌లో 39.4, ఖమ్మంలో 40.6, మహబూబ్‌నగర్‌లో 41.1, మెదక్‌లో 41.6, నల్లగొండలో 41.5, నిజామాబాద్‌లో 41.9, రామగుండంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపిలో పెరిగిన వడగాడ్పులు
తెలంగాణకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈ ప్రభావం సరిహద్దు జిల్లాల్లో కూడా కనిపిస్తోంది. ఏపిలోని కడపలో అత్యధికంగా 44.7డిగ్రీలు ,నంద్యాలలో 44.5, కర్నూలు, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో 44.డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే 110మండలాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి మరో 98మండలాలకు విస్తరించే అవకాశం ఉన్నందునఅప్రమత్తంగా ఉండాలని ఏపి విపత్తుల నిర్వహణ శాఖ అధికారి అంబేద్కర్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News