- Advertisement -
మియాపూర్: సంగారెడ్డి జిల్లా మియాపూర్ లో లారీ బీభత్సం సృష్టించింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అతివేగంగా డ్రైవింగ్ చేసి హోంగార్డు ప్రాణాలు తీశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మియాపూర్ లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారికోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అదే సమయంలో లారీ అతివేగంగా పోలీసుల పైకి దూసుకొచ్చింది. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసులతో పాటు హోం గార్డుకు గాయాలు కావడంతో గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హోంగార్డు మృతి చెందాడు. ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.
- Advertisement -