Sunday, December 22, 2024

మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన మియాపూర్ సిఐ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

మియాపూర్: మియాపూర్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ సస్పెండ్ చేస్తూ మంగళవారం సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశాడు. ఆమె భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సదురు మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో ఆమె సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన పోలీస్ ఉన్నతాధికారులు సిఐ ప్రేమ్‌కుమార్ చేసిన తప్పు నిజం అని తేలడంతో సైబరాబాద్ సిపి సిఐను సస్పెండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంపై సిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News