Monday, December 23, 2024

మియాపూర్ మెట్రో స్టేషన్ మూసివేత…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మియాపూర్ మెట్రో స్టేషన్‌కు పెద్ద ఎత్తున ఐటి ఉద్యోగులు తరలివచ్చారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి
చంద్రబాబుకు మద్దతుగా ‘లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్” అనే కార్యక్రమాన్ని ఐటి ఉద్యోగులు చేపట్టారు. ఐటి ఉద్యోగులు నల్ల చొక్కాలు, టీ షర్ట్ ధరించి నిరసన తెలియజేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండించడంతో పాటు తాము సిబిఎన్ తోనే ఉన్నామని ముక్త కంఠంతో నిరసన తెలిపారు. వైసిపి బహిష్కృత ఎంఎల్‌ఎ ఉండవల్లి శ్రీదేవి మియాపూర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. మెట్రో స్టేషన్ల వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు మెట్రో స్టేషన్లలో నల్లచొక్కాలు, టీషర్టులు ధరించిన వారిని పోలీసులు అనుమతించడంలేదు. మియాపూర్ మెట్రో స్టేషన్‌ను కాసేపు తాత్కాలికంగా మూసివేశారు. ఎల్‌బినగర్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. మెట్రోస్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పైనా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. భరత్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఐటి ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, అమెరికాలో ఐటి ఉద్యోగులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

Also Read: ఆ విషయం నేనే ప్రకటిస్తా: రేణు దేశాయ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News