Friday, January 24, 2025

బాధితురాలితో అసభ్య ప్రవర్తన… మియాపూర్ ఎస్ఐపై వేటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ కేసులో విషయంలో ఫిర్యాదు చేసిన బాధితురాలితో ఎస్‌ఐ అసభ్యంగా ప్రవర్తించడంతో సైబరాబాద్ కమిషనర్ అతడిని సస్పెండ్ చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో గిరీష్ కుమార్ అనే పోలీస్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఓ మహిళ బ్యూటీషియన్‌గా పని చేస్తుంది. తన స్నేహితుడు రూ.6 లక్షలు మోసం చేశాడని సదరు మహిళ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తిని విచారణకు పిలిపించి డబ్బులు ఆమెకు ఇప్పించాడు. కేసు ముగియటంతో సదరు ఎస్‌ఐ మహిళ నంబర్ తీసుకొని పలుమార్లు మాట్లాడాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో సిపికి నేరుగా ఫిర్యాదు చేసింది. పోలీస్ విచారణలో నిజమని తేలడంతో ఎస్‌ఐపై వేటు వేస్తూ సిపి ఆదేశిలిచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News