Thursday, January 23, 2025

మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి వరకు ఆరు వరుసలుగా రోడ్డు విస్తరణ

- Advertisement -
- Advertisement -

31 కి.మీలు రూ.1400 కోట్ల వ్యయం
మనతెలంగాణ/హైదరాబాద్:  మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి (పోతిరెడ్డిపల్లి చౌరస్తా) వరకు ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు వరుసలుగా మార్చడానికి ఈ నెలాఖరులోగా టెండర్‌లను పిలవాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. మియాపూర్ మార్గంలో అనునిత్యం ట్రాఫిక్ నరకప్రాయంగా మారుతోంది. ఈ మేరకు అధికారులు దీనికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేసి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రిత్వశాఖకు గతంలో పంపించారు. ప్రస్తుతం ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి 31 కి.మీల దూరం ఉండగా, ఈ రోడ్డు విస్తరణకు సుమారుగా రూ.1,400 కోట్లు వ్యయం కానుందని అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.

Also Read: చలాకి చంటికి గుండెపోటు

ఇందులో రోడ్డు నిర్మాణ పనులకు రూ.వేయి కోట్లు, భూసేకరణ పరిహారానికి రూ.400 కోట్లు ఖర్చు కానుంది. నగరంలోనే పెద్ద రోడ్డుగా ఉన్న ఈ మార్గంలో ఉన్న కూకట్‌పల్లి వద్ద ట్రాఫిక్ద్ద్రీ అధికంగా ఉండడంతో గతంలో మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసి ఇప్పటికే మియాపూర్ వరకు రోడ్డును వివరించింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎన్‌హెచ్‌ఏఐ ఈ రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించడంతో ప్రధాన క్యాజ్‌వే, దాని పక్కన సర్వీస్ రోడ్డు కలిపి 200 అడుగుల విశాలంతో ఈ రోడ్డును విస్తరించనున్నారు.

ప్రస్తుతం ఈ రోడ్డు నాలుగు వరుసలుగా ఉండగా దాని పక్కన చాలాచోట్ల 60 మీటర్ల మేర స్థలం ఖాళీగా ఉంది. ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకొని దానిని ఆరు వరుసల రహదారిగా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా ఈ పనులకు టెండర్‌లను పిలిచి రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. రానున్న రోజుల్లో వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటాన్‌చెరు, ఇస్తాపూర్, ముత్తంగి, రుద్రారం తదితర ప్రాంతాల్లో ప్లై ఓవర్లను నిర్మించనున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా పలుచోట్ల ఖాళీ స్థలం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు నిర్మాణాలను తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News