Sunday, January 19, 2025

ఈ నెల 4 న మిజోరం కౌంటింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చారు. ఈ నెల 4వ తేదీ సోమవారం  ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అన్ని రాష్ట్రాలతో పాటు మిజోరం ఓట్ల లెక్కింపు కూడా ముందటి నిర్ణయం ప్రకారం ఆదివారం ( 3వ తేదీ ) జరగాలి. అయితే మిజోరం ఎన్‌జిఒ కోఆర్డినేషన్ కమిటీ నిరసనల నేపథ్యంలో కౌంటింగ్‌ను మరుసటి రోజుకు మార్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఆదివారం క్రిస్టియన్లకు పవిత్ర దినం అయినందున ఈ రోజున కౌంటింగ్ కుదరదని ముందుగానే క్రిస్టియన్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మిజోరంలో డిమాండ్ తలెత్తింది.అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు మిజోరంలో కౌంటింగ్‌ను వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News