Wednesday, November 6, 2024

ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ప్రారంభం….

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్, మిజోరంలో శాసన సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత పోలింగ్ జరుగుతోంది. బస్తర్, జగదల్‌పూర్, చిత్రకోట్‌లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ జరగనుంది. అంతగఢ్, భానుప్రతాపూర్, కంకేర్, కేస్‌కల్, కోండగావ్, నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొంటా స్థానాల్లో మధ్యాహ్నం మూడు వరకే పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ జరిగే 20 స్థానాల్లో 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

తొలి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. బస్తర్ ప్రాంతంలో ఎన్నికలు బహిష్కరించాలని నక్సలైట్లు పిలుపునిచ్చారు. ఇవాళ పోలింగ్ జరిగే 20 స్థానాల్లో బస్తర్ డివిజన్‌లో 12 స్థానాలు ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 60 వేల మంది పోలీసు బలగాలు మోహరించాయి. సమస్యాత్మక ప్రాంతమైన బస్తర్‌లో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు హెలికాప్టర్లు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మొత్తం 90 శాసన సభ స్థానాలు ఉన్నాయి. మిగితా 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.

మిజోరం రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది.  మొత్తం1,276 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 149 పోలింగ్ కేంద్రాలు మారుమూల కొండప్రాంతాల్లో ఉన్నాయి. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల వెంట ఉండే 30 పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు. బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వెంట భద్రతను మరితం కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మిజో నేషనల్ ఫ్రంట్, బిజెపి కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తామన్న విశ్వాసంతో కాంగ్రెస్ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News