Monday, January 20, 2025

ఎంఎల్‌ఎలు పాతకార్లే వాడుకోవాలి: ముఖ్యమంత్రి

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్: మిజోరం రాష్ట్రం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే సిఎం లాల్‌దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎంఎల్‌ఎలకు కొత్త కార్లు ఇవ్వటం లేదని పాత కార్లే వాడుకోవాలని సిఎం సూచించారు. మిజోరం ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఎంఎల్‌ఎలకు కొత్త కార్లు కొనుగోలు చేయటానికి ప్రభుత్వ ఖాజానాలో నిధులు లేకపోవడంతో పాత కార్లనే వాడుకోవాలని మంత్రులు, ప్రభుత్వాధికారులకు ఆదేశించారు. ప్రభుత్వానికి అనుగుణంగా మంత్రులు, వివిధ శాఖల ఉద్యోగులు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News