Sunday, January 19, 2025

హంగ్ వచ్చే ప్రసక్తే లేదు

- Advertisement -
- Advertisement -

తమ రాష్ట్రంలో హంగ్ రానే రాదని మిజోరాం ముఖ్యమంత్రి, మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు జొరామ్ తంగా అన్నారు. 40 సీట్లు ఉన్న మిజోరాం అసెంబ్లీకి మంగళవారం పోలింగ్ జరుగుతోంది. ఐజ్వాల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం జొరామ్ తంగా విలేఖరులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే తమను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంఎన్ఎఫ్ అధికారంలోకి వస్తే మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి తరలివచ్చిన శరణార్థులకు పునరావాసం కల్పిస్తామన్నారు. ప్రస్తుతం మిజోరాం 32,492 మంది శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. అలాగే మణిపూర్ నుంచి వచ్చి తలదాచుకుంటున్న 11,991మందికి కూడా ఆశ్రయమిస్తోంది. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే, మిజొరాంలో ఆశ్రయం పొందుతున్న మణిపూర్ వాసులకు ఇళ్లు కట్టించి ఇస్తామని జొరామ్ తంగా హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News