Friday, December 20, 2024

డాక్టరుపై కూతురు దాడి

- Advertisement -
- Advertisement -

Mizoram CM's Daughter attacked on doctor

సారీ చెప్పిన మిజోరాం సిఎం

ఐజ్వాల్ /గువహతి : మిజోరాం ముఖ్యమంత్రి జోరథాంగా కూతురు మిలారీ ఛాంగ్టే ఓ డాక్టరుపై దౌర్జన్యానికి దిగింది. మిలారీ ఐ మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో ఓ డెర్మాటాలజిస్టు క్లినిక్‌కు వెళ్లింది. అయితే అపాయింటెమెంట్ లేకుండా తాను పరీక్షించడం జరగదని డాక్డరు ఆమెకు తెలిపారు. ముందు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. దీనితో కోపం పట్టలేక ఆ యువతి డాక్టరుపైకి దూసుకువెళ్లి అంతా చూస్తూ ఉండగానే ముఖంపై కొట్టింది. ఈ ఘటన అక్కడి సిసికెమెరాలలో, సెల్‌ఫోన్ల ద్వారా క్షణాలలోనే సామాజిక మాధ్యమాలలోకి వెళ్లింది. డాక్టరుపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ డాక్టర్లు, సంఘాలు నిరసనలకు దిగాయి. ఈ దశలో ముఖ్యమంత్రి కలుగ చేసుకుని బహిరంగ క్షమాపణ తెలిపారు. రాతపూర్వక ప్రకటన కూడా వెలువరించారు. కూతురి దుష్ప్రవర్తనకు చింతిస్తున్నానని, వైద్యుడికి క్షమాపణలు తెలియచేస్తున్నానని పేర్కొన్నారు. ఆమె వ్యవహారశైలిని తాను ఏ విధంగా కూడా సమర్ధించజాలనని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News