Friday, November 22, 2024

కేంద్ర సాయంపై మిజోరం నిరీక్షణ

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్ : మణిపూర్ నుంచి మిజోరంకు తరలివచ్చిన 12,611 మంది నిర్వాసితులకు ఆశ్రయం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ సాయం కోసం మిజోరం ప్రభుత్వం నిరీక్షిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జొరాంతంగ తక్షణ సాయం కింద రూ 10 కోట్లు కేంద్రం నుంచి ఆశిస్తున్నారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదని మిజోరం హోం కమిషనర్, సెక్రటరీ హెచ్. లాలెంగ్‌మావియా వెల్లడించారు. శుక్రవారం వరకు మిజోరంలో ఆశ్రయం పొందిన మొత్తం 12,611 మంది నిర్వాసితుల్లో 4440 మంది కొలాసిబ్ జిల్లా లోను,

4265 మంది ఐజ్వాల్ లోను, 2951 మంది సైతుయల్ లోను ఆశ్రయం పొందారని, మిగతా 955 మంది చాంఫై, మమిట్, సియాహ, లాంగ్‌ంగ్‌ట్లయై, లంగ్లె, సెర్చిప్, కాజల్, హ్నథియల్ జిల్లాల్లో ఉంటున్నారని వివరించారు. మిజోరం ప్రభుత్వం, స్థానిక గ్రామ అధికారులు ఐజ్వాల్, కొలాసిబ్, సైత్యుయల్ లో 38 పునరావాస శిబిరాలు నెలకొల్పారని చెప్పారు. నిర్వాసితుల కోసం రాష్ట్రప్రభుత్వం సొంతంగా నిధులు సేకరించి సహకరిస్తోందని , అలాగే ప్రభుత్వంతోపాటు ఎన్‌జిఒలు, చర్చిలు, గ్రామస్థులు ఆహారం, ఇతర అవసరాలు సమకూరుస్తున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News