Thursday, January 9, 2025

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలిలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను తరలించడం కోసం ఎయిర్ పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్‌ఛానల్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కాగా కంభంపాటి హరిబాబు 2014 నుంచి 2019 వరకు బిజెపి ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో ఎపి బిజెపి అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2021లో మిజోరం గవర్నర్‌గా హరిబాబు నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఆయన కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News