Wednesday, January 22, 2025

పులిని చంపిన వీరనారి జెడింగీ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్: శౌర్యచక్ర అవార్డు గ్రహీత, మిజోరం వీరనారి జెడింగీ(72) కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్‌దుహోమా ఆమె మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. లుంగేలేయీ జిల్లా బువార్‌పుయీ గ్రామంలో 1978 జులై 3న జెడింగీ తన చెరుకు తోటలో పని చేస్తుండగా పులి దాడి చేయడానికి ప్రయత్నించింది. వెంటనే ఆమె వెంటనే తేరుకొని గొడ్డలి పులి తలపై వేటు వేయడంతో అది అక్కడి చనిపోయింది. దీంతో అప్పుడు ఆమె పేరు మార్మోగిపోయింది. ఆ పులి కళేబరం ఇప్పటికీ మిజోరం రాష్ట్ర మ్యూజియంలో ఉంది. 1980లో భారత ప్రభుత్వం ఆమెను వీరనారిగా గుర్తించి శౌర్య చక్ర అవార్డుతో సత్కరించారు. ఆమె సాహసగాధను మిజోరం విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News