Monday, December 23, 2024

డీఎంకె అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన స్టాలిన్

- Advertisement -
- Advertisement -

MK Stalin re-elected as DMK president

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మరోసారి డీఎంకే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఆ పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీగా దురైమురుగన్ , కోశాధికారిగా టీఆర్ బాలు ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు నేతలు ఈ పదవులకు రెండోసారి ఎన్నికవడం విశేషం. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన స్టాలిన్‌కు ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. డీఎంకెలో వివిధ స్థాయిల ఎన్నికలు తమిళనాడు వ్యాప్తంగా జరిగాయి. ఆ తర్వాత పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు జరిగాయి. ఎంకె స్టాలిన్ గతంలో డీఎంకె కోశాధికారిగా, యువజన విభాగం కార్యదర్శిగా పని చేశారు. 2018 లో కరుణానిధి మరణానంతరం స్టాలిన్ డిఎంకె అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News