Tuesday, January 21, 2025

యుసిసి అమలుకు కేంద్రం యత్నంపై స్టాలిన్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

చెన్నై : ఉమ్మడిసివిల్ కోడ్ ( యుసిసి)ను అమలు చేయడానికి కేంద్రం ప్రయత్నించడం బీజేపీయేతర రాష్ట్రాలపై ప్రతీకార చర్యల్లో భాగమేనని డిఎంకె నేత, ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి బీజేపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని, దానికి బదులుగా ప్రజావ్యతిరేక భావంతో మతం, సనాతన అనే భావాలను ప్రజలపై రుద్దడానికి ముందుకు వస్తోందని ఆరోపించారు. ఉమ్మడి సివిల్ కోడ్ అమలు ప్రతిపాదనను ప్రస్తావిస్తూ ఇప్పటికే దేశంలో సివిల్,

క్రిమినల్ చట్టాలు అమలులో ఉన్నాయని, ఇక వ్యక్తిగత చట్టాలను రద్దు చేయడం ద్వారా ఉమ్మడి సివిల్ కోడ్‌ను అమలు లోకి తేడానికి ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. ఎవరైతే బీజేపీని, దాని భావజాలాన్ని, కేంద్రంలో దాని పాలనను వ్యతిరేకిస్తారో వారిని లక్షంగా పెట్టుకుని ప్రతీకార చర్యకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. అందుకని కేంద్రంలో హామీలన్నీ నెరవేర్చగల తమిళనాడు ప్రభుత్వం వంటి ద్రవిడ విధాన ప్రభుత్వం అవసరముందని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News