Wednesday, January 22, 2025

ఇలాగే వేధిస్తూ పోతే ఏకాకి అవుతారు: స్టాలిన్

- Advertisement -
- Advertisement -

పాలనపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థులనే టార్గెట్ చేసుకుంటూ పోతే ఏకాకి అవుతారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్‌లో తమిళనాడుకు మొండిచేయి చూపడంపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు అయిపోయాయి. ఇక మనం దేశం గురించి ఆలోచించాలి. బడ్జెట్ 2024 మీ పాలనను కాపాడవచ్చు..కాని దేశాన్ని కాపాడలేదు. నిష్పాక్షికంగా ప్రభుత్వాన్ని నడపండి..లేనిపక్షంలో మీరు ఏకాకిగా మిగులుతారు అని స్టాలిన్ ట్వీట్ చేశారు. మిమల్ని ఓడించినవారి పట్ల ఇంకా కక్షపూరితంగా ఉండకండి&మీ రాజకీయ ఇష్టాలు అయిష్టాలకు అనుగుణంగా మీరు పాలన సాగిస్తే ఏకాగిగా మిగులుతారు అని ఆయన మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్‌లో బిజెపియేతర పార్టీల పాలిత రాష్ట్రాలను విస్మరించడం పట్ల ప్రతిపోఆల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. చెన్నై మెట్రో రైలు రెండవ దశ, కోయంబత్తూరుకు మెట్రో ప్రాజెక్టుతోసహా మౌలిక సౌకర్యాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం పట్ల తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నై, ఇతర దక్షిణాది జిల్లాలలో వరద తాకిడికి గురైన ప్రాంతాల పునరుద్ధరణ కోసం రూ. 37,000 కోట్ల నిధులను కోరితే కేంద్రం కేవలం రూ. 276 కోట్లు మాత్రమే ఇచ్చిందని తమిళనాడు ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసింది. బడ్జెట్‌లో తమ రాష్ట్రాన్ని విస్మరించినందుకు నిరసనగా ఈనెల 27న(శనివారం) ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళల్కూడదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించుకున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్దరామయ్య(కర్నాటక), రేవంత్ రెడ్డి(తెలంగాణ), సుఖ్వీందర్ సుఖూ(హిమాచల్ ప్రదేశ్) కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News