- Advertisement -
చెన్నై: తమిళనాడు సిఎంగా డిఎంకె చీఫ్ స్టాలిన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజే స్టాలిన్ కీలక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తమిళనాడు ప్రజలపై వరాల కురిపించారు. కోవిడ్-19 వేళ ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా వరాలు ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. రేషన్ కార్డు ఉన్న 2.07 కోట్ల కుటుంబాలకు రూ.4వేల చొప్పున సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సాయాన్ని కరోనా ఆర్థిక సాయం కింద ఇస్తున్నట్టు స్టాలిన్ చెప్పారు. త్వరలో మొదటి విడత కింద ఈ నెలలో రూ.2 వేల చొప్పున జమ చేస్తామన్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా లీటరు పాలపై రూ.3 తగ్గిస్తూ తమిళనాడు కొత్త సర్కార్ నిర్ణయం తీసుకుంది.
mk stalin was sworn in as chief minister
- Advertisement -