Wednesday, January 22, 2025

నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదిపై వేలాడుతున్న కత్తి : స్టాలిన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టడంపై లోక్‌సభలో చర్చ జరుగుతుండగా, పార్లమెంట్ వెలుపల కూడా బిల్లు ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజక వర్గాల పునర్విభజనను దక్షిణ భారత రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తిగా డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “ఇదొక రాజకీయ యుక్తి. జనాభా ఆధారంగా పార్లమెంట్ సీట్లు పెరిగితే దక్షిణ భారత రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుంది” అని సీఎం కార్యాలయం ఆ పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఇది రాజకీయంగా చైతన్యం కలిగిన తమిళనాడు వంటి రాష్ట్రాలను మొగ్గలోనే తుంచివేసే చర్యగా తప్పు పట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును మేం స్వాగతిస్తున్నాం. కానీ ఇదే సమయంలో డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది ప్రజలకు ఎలాంటి నష్టం చేయబోమని ప్రధాని మోడీ హామీ ఇవ్వాలని కోరుతున్నాం. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలకున్న భయాందోళనలను ప్రధాని తొలగించాల్సిన అవసరం ఉంది” అని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News