- Advertisement -
చెన్నై: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గడచిన రెండు నెలల్లో రెండు సార్లు కరోనా వైరస్ బారినపడడం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ట్వీట్ చేశారు. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నట్లు స్టాలిన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆమె త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆమెను త్వరలోనే తిరిగి కార్యరూపంలో చూడగలనంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా..కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శనివారం ఉదయం వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమె ఐసోలేషన్‌లో ఉంటారని ఆయన ట్వీట్ చేశారు.
- Advertisement -