Tuesday, November 5, 2024

‘ నీట్ ’పరీక్ష రద్దు అయ్యే వరకు ఆందోళన ఆగదు: స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడుకు ‘ నీట్ ’ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రంలో అధికార పార్టీ డిఎంకె ఆదివారం నిరాహార దీక్ష చేపట్టింది. మధురలో ఎఐఎడిఎంకె భారీ రాష్ట్ర సదస్సు జరుగుతున్నందున అక్కడ ఈరోజు నిరాహార దీక్ష జరగలేదు. ఈనెల 23న అక్కడ నీట్‌కు వ్యతిరేకంగా సమ్మె చేస్తారు. ఈ నేపథ్యంలో డిఎంకె అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు లభించే వరకు ఆందోళన ఆగబోదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లుపై తాను సంతకం చేయనని రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఇటీవల వ్యాఖ్యానించడంపై స్టాలిన్ ధ్వజమెత్తారు.

అసెంబ్లీ చేపట్టిన అంశాలను రాష్ట్రపతి భవన్‌కు పంపే ‘పోస్ట్‌మన్’ వంటిది మాత్రమే గవర్నర్ విధి అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. చెన్నై లోని వల్లువార్ కొట్టాం వద్ద చేపట్టిన నిరాహార దీక్ష శిబిరం వద్ద డిఎంకె యువజన విభాగం చీఫ్ ఉదయ నిధి నిరాహార దీక్షకు నేతృత్వం వహించారు. ఆత్మహత్యకు పాల్పడిన నీట్ అభ్యర్థులైన వైద్య విద్యార్థుల ఎస్. అనిత ( అరియలూరు) తదితర అభ్యర్థుల చిత్ర పటాలను వేదికపై ప్రదర్శించి నివాళులర్పించారు. గతవారం మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడడంతో నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News