Thursday, January 23, 2025

ముందు హిందువులకు అమలు చేయండి

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన డిఎంకె ఆక్షేపించాయి. ఉమ్మడి పౌరస్మృతిని ముందుగా హిందువులకు వర్తింపజేయాలని స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె డిమాండ్ చేసింది. ఆపై అన్ని కులాలవారిని దేవాలయాల్లోకి అనుమతించాలని కోరింది.‘ ఉమ్మడి పౌరస్మృతిని ముందుగా హిందూమతంలో ప్రవేశపెట్టాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారందరినీ దేశంలోని ఏ ఆలయంలోనైనా పూజలు జరుపుకొనేందుకు అనుమతించాలి’ అని డిఎంకె నేత టికెఎస్ ఇలంగోవన్ అన్నారు.

ప్రతి మతానికి రాజ్యాంగం రక్షణ కల్పించునందునే ఉమ్మడి పౌరస్మృతిని తాము కోరుకోవడం లేదని ఆయన అన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా దేశంలో పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ నిలదీశారు. అల్లర్లతో భగ్గుమంటున్న మణిపూర్‌పైన ఆయన ఎప్పుడూ మాట్లాడరని, ఈ అంశాలన్నిటినుంచీ ప్రజలదృష్టిమళ్లిస్తారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News