Friday, March 21, 2025

రిబ్బన్ కలర్ మారిందని ఉద్యోగిపై ఎంఎల్ఎ దాడి… (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

దిస్ పూర్: రిబ్బన్ కలర్ మారిందని ఉద్యోగిపై ఓ ఎంఎల్ఎ విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన అస్సాం రాష్ట్రంలోని బిలాస్ పూర్ లో జరిగింది. బిలాస్‌పూర్ స్థానిక ఎమ్మెల్యే షంసుల్ హుడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చారు. కాంట్రాక్టర్ ఉద్యోగి సాహిదుర్ రెహమాన్‌ ఎరుపు రంగుకు బదులుగా గులాబీ రంగు రిబ్బన్ పెట్టించారు. గులాబీ రంగు రిబ్బన్ కనిపించగానే ఎంఎల్ఎ షంసుల్ ఆగ్రహంతో ఊగిపోయారు. రెహమాన్ గళ్ల పట్టుకొని దగ్గరికి లాగి అతడి చెంప చెళ్లుమనిపించాడు. అక్కడ ఉన్న ఆరటి చెట్టు కాండను తీసుకొని అతడిపై ఎంఎల్ఎ పలుమార్లు దాడి చేశారు. ఉద్యోగిపై ఎంఎల్ఎ దాడి చేయడంతో అక్కడ ఉన్నవారు షాక్ కు గురయ్యారు. ఎమ్మెల్యే అహంకారం, అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనమని రెహమాన్ మండిపడ్డారు. రిబ్బన్ రంగు మారితే దాడి చేయాలా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. చిన్న విషయానికే కంట్రాక్ట్ ఉద్యోగిని చావబాదారని, అవినీతికి పాల్పడిన ప్రజాప్రతినిధులను ఏం చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News