Thursday, March 13, 2025

అప్పులు, అవినీతి, అక్రమాల్లో తెలంగాణ నంబర్‌వన్‌: ఆది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అప్పులతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పులు పాలు చేసిందని దుయ్యబట్టారు. శాసన సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరిగింది. తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు. తెలంగాణలో శాస్త్రీయంగా కులగణన జరిగిందని, కులగణనలో కెసిఆర్ కుటుంబం పాల్గొనలేదని, కులగణనపై అభినందనలు చెప్పకుండా విమర్శలు చేయడం మంచిది కాదని హితువు పలికారు.

బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సాహసోపేత నిర్ణయమని ఆది ప్రశంసించారు. గత ప్రభుత్వం కేవలం రైతుబంధు ఇచ్చి అని పథకాలు ఆపేసిందని, రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గుతుందని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని ప్రాజెక్టులు వేగంగా ముందుకు వెళ్తున్నాయని, సన్న వడ్లు పండించిన వారికి రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. తొలి పదేళ్లు తెలంగాణకు చీకటి యుగం అని ఆది అభివర్ణించారు. కెసిఆర్ పాలనలో అప్పులు, అవినీతి, అక్రమాల్లో నంబర్‌వన్‌గా తెలంగాణ నిలిచిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం నెంబర్ వన్ స్థానంలో ఉందని కితాబిచ్చారు. ఉద్యోగుల నియమాకాలు, పరిశ్రమ పెట్టుబడుల్లో నంబర్ వన్ స్థానంలో ఉందని ఆది కొనియాడారు. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణు ముందుకెళ్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News