Monday, December 23, 2024

కెసిఆర్ ను కలిసిన ఎంఎల్ఎ ఆల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కలిశారు. తన నియోజకవర్గ పరిధిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్, మంత్రి నిరంజన్ రెడ్డిని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటికే ఆయిల్ ఫామ్ సాగు పెరిగిందని ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అలాగే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే దాదాపు 500 మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రిని తెలియజేశారు.

దేవరకద్ర నియోజకవర్గంలో కెసిఆర్ సహకారంతో 21 చెక్ డ్యామ్ లు నిర్మించుకున్నామని, వీటి మూలంగా కందురు పెద్ద వాగు, ఉకచెట్టు వాగు సజీవంగా మారిందని, భూగర్భం జలం పెరగడంతో బోర్లలో నీరు ఉండడంతో అదనంగా ఆయకట్టు పెరిగిందని, రైతులు సంతోషంగా ఉన్నారని కెసిఆర్ కు తెలిపారు. ఇంకా రెండు వాగులపై కొన్ని చోట్ల చెక్ డ్యామ్ లను నిర్మించాలని, ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని వాటిని మంజూరు చేయాలని కెసిఆర్ ను కోరడంతో సిఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ఆల తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News