Monday, December 23, 2024

తెనాలిలో ఓటరుపై చేయిచేసుకున్న ఎంఎల్ఏ అన్నాబత్తుని

- Advertisement -
- Advertisement -

తెనాలి: ఓ పోలింగ్ బూత్ లోకి ఎంఎల్ఏ అన్నాబత్తుని శివ కుమార్  వెళుతుండగా, క్యూ లైన్ లో నిలుచున్న గొట్టి ముక్కల సుధాకర్ అనే వ్యక్తి అభ్యంతరం చెప్పాడు. లోపలికి వెళ్లొద్దని అన్నాడు. దాంతో ఎంఎల్ఏ రెచ్చిపోయి అతడి చెంప చెళ్లుమనిపించాడు. దానికి ఆ ఓటరు కూడా తీవ్రంగానే స్పందించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా ఓటరుపై చేయి చేసుకున్న ఎంఎల్ఏ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఈసి ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎంఎల్ఏ అన్నాబత్తుని శివ కుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశంలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News